బుల్లి తెరపై వచ్చే కామెడీ షోల ద్వారా పాపులర్ అయింది యాంకర్ రష్మీ. అప్పడప్పుడు కొన్ని సినిమాల్లో నటించినా అవి పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు మళ్లీ అవకాశాలు రావడంలేదు. ఇక సోషల్ మీడియాలో అయితే రష్మీకి సంబంధించిన వార్తలు చాలా వస్తుంటాయి. తాజాగా ఆమె ట్వీట్టర్ లో లైవ్ చాట్ లొ పాల్గొని తన అభిమానులు అడిగన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఓ అభిమాని సుడిగాలి సుధీర్ ని ఎందుకు అంతలా అసహ్యించుకుంటారని ప్రశ్నించగా.. దానికి ఆమె.. ”అలాంటి వారిని నేనెప్పుడూ అసహ్యించుకోను. ఎందుకంటే వారు నన్ను మహారాణిలా ట్రీట్ చేస్తారని చెప్పింది.
మరో వ్యక్తి సుధీర్, ప్రదీప్ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎవరిని చేసుకుంటావని అడగగా.. రష్మీ స్పందిస్తూ.. నా వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ వేరువేరుగా ఉంటాయి. వర్క్ లైఫ్ లో ఉండేవారు పర్సనల్ లైఫ్ లో ఉండరని చెప్పింది. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా..? అరెంజ్ డ్ మ్యారేజా..? అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. ”మధ్యలో సహజీవనం అనే ఆప్షన్ ఉంటుంది తెలుసా అంటూ సమాధానం ఇచ్చింది రష్మీ.