ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు…

235
- Advertisement -

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మోతాదుకు మించి మద్యం సేవించడంతో ప్రదీప్‌ డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 ఏళ్లు రద్దు చేయడంతో పాటు రూ.2100 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. డ్రంక్‌ డ్రైవ్‌ చేయకూడదని ప్రచారం చేశావు, అలాంటిది తెలిసి ఎలా తప్పు చేశారని ప్రదీప్‌ను కోర్టు ప్రశ్నించింది. తప్పు జరిగిపోయింది అని ప్రదీప్‌ అంగీకరించారు.

డిసెంబర్‌ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రదీప్‌ పట్టుబడ్డారు. కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో పోలీసులు కేపీహెచ్‌బీలోని ఆయన కార్యాలయంతోపాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అందించేందుకు ప్రయత్నించారు. అయితే, అతను అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చారు. దీంతో ప్రదీప్‌ పరారీలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. గత శుక్రవారం వీడియో ద్వారా తాను త్వరలోనే కౌన్సెలింగ్‌కు హాజరుకాబోతున్నట్లు తెలిపిన ప్రదీప్ ఇవాళ తండ్రితో కలిసి కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు.

pradeep

పోలీసులు విధించిన నిబంధనలను ఫాలో అవుతున్నా. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపారు.మరోసారి ఈ తప్పు చేయనని తెలిపిన ప్రదీప్…తాగి ఎవరు వాహనం నడపొద్దని సూచించారు. తనకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -