తెలుగు టెలివిజన్ రంగంలో తక్కువ కాలంలోనే ఎంతో పేరుతెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరి మనసుల్లో ప్రదీప్ చెరగని ముద్రవేసుకున్నారు. 100% లవ్ , అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో చిన్న పాత్రలు కూడా పోషించాడు.
ఇక ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్న షోలో టాప్‌లో ఉన్న షో ఢీ జోడి. ప్రదీప్‌తో సుధీర్,రష్మీ ప్రధానంగా సాగే షో అధ్యంతం నవ్వులు పంచడంతో పాటు కంటెస్టెంట్‌లు డ్యాన్స్‌లు ఇరగదీస్తారు. అయితే ప్రతిసారి ఈ షోలో సుధీర్‌ని డామినేట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు ప్రదీప్.
కానీ తాజాగా విడుదల చేసిన ప్రొమోలో ప్రదీప్ కంటతడి పెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది. సుధీర్ కోరిక మేరకు హుషారు సినిమాలోని పాటపాడిన ప్రదీప్ కన్నీళ్లు పెట్టేశాడు. ప్రదీప్‌తో తనకు పది సంవత్సరాల పరిచయం ఉందని తను కన్నీళ్లు పెట్టడం ఇంతవరకు చూడలేదని చెప్పడం అంతే ఎమోషనల్‌గా ప్రొమోని తీర్చిదిద్దారు. అయితే ఇదంతా పబ్లిసిటీకి కోసం చేసిందా లేదా నిజంగానే ప్రదీప్ ఫస్ట్ లవ్‌ని గుర్తుచేసుకుని బాధపడ్డాడా తెలియాలంటే ప్రొగ్రాం టెలికాస్ట్ అయ్యే వరకు వేచిచూడాల్సిందే.