డ్రంకన్‌ డ్రైవ్‌లో యాంకర్ ప్రదీప్

209
Anchor Pradeep Caught Drunk And Drive
- Advertisement -

కొత్త ఏడాది 2018 సందర్భంగా హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంగ్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.  పలువురిపై కేసు నమోదు చేశారు. వాహనాలను సీజ్ చేశారు. ఆదివారం (డిసెంబర్ 31) అర్ధరాత్రి ఒక్కరోజే హైదరాబాదులో 55,540 వాహనాలను తనిఖీ చేశారు. 1683 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.

పోలీసుల డ్రంకన్ డ్రైవ్‌లో యాంకర్ ప్రదీప్ మద్యం తాగి పోలీసులకు దొరికిపోయారు.  జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లో జరిగిన తనిఖీల్లో  ఓ పబ్బులో మందు కొట్టి వచ్చిన అతను డ్రైవర్ లేకుండా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. బ్రీత్ అనలైజర్ టేస్టులో ప్రదీప్‌ది 178 పాయింట్ల రీడింగ్ నమోదయింది. ప్రదీప్ మోతాదుకు మించి మూడింతలు మద్యం తాగారు.   స్కోడా కంపెనీకి చెందిన టీఎస్ 07 ఈయూ 6666 కారును పోలీసులు సీజ్ చేశారు.

 Anchor Pradeep Caught Drunk And Drive
న్యూఇయర్ పేరుతో పోలీసులకు పట్టుబడిన కార్లలో ఎక్కువగా ఖరీదైనవే ఉండటం గమనార్హం. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నిండా ఖరీదైన కార్లు ఉన్నాయి. మోతాదుకు మించి మద్యం తాగితే నిందితులకు జైలు శిక్ష పడ అవకాశముంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోనే పబ్బులు ఎక్కువగా ఉండటంతో అక్కడ ఎక్కువగా దొరికారు.

- Advertisement -