ఓంకార్ కు కరోనా పాజిటివ్…స్పందించిన కుటుంబ సభ్యులు

359
omkar
- Advertisement -

ప్రముఖ టీవీ యాకంర్, నటుడు, దర్శకుడు ఓంకార్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. సోషల్ మీడియాలో ఓంకార్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. ఓంకార్ కరోనా టెస్ట్ కూడా చేయించుకున్నారని, నెగటివ్ వచ్చిందని అన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలకు అనుగుణంగానే ఆయన షూటింగ్ లకు హాజరవుతున్నారని తెలిపారు.

కాగా ఓంకార్ ప్రస్తుతం మా టీవీలో ఇస్మార్ట్ జోడీ షోలో హోస్ట్ గా చేస్తున్నారు. అయితే ఇటివలే ఆయన షూటింగ్ పాల్గోన్నారు. అనుమానంతో ఆయన నిన్న కరోనా టెస్ట్ లు చేయించుకున్నారు. ఆయనకు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓంకార్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. దీంతో నేడు ఓంకార్ కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు చెక్ పెట్టారు. కాగా ప్రభుత్వ అనుమతితో ఇటివలే షూటింగ్ లు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

- Advertisement -