ప్రముఖ తమిళ టీవీ, సినీనటి సబర్న, అలియాస్ సుగుణ (29)అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మరణించారు. చెన్నైలోని మధురావాయిల్ ఏరియాలోని ఓ డబుల్ బెడ్ రూం హౌస్ నివాసం ఉంటుంది. మూడు రోజులుగా ఇంటి తలుపులు తెరుచుకోకపోవటం.. ఎవరూ బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు తీయగానే ఓపెన్ చేసి ఉండటంతో షాక్ అయ్యారు. ప్రాథమికంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నప్పటికీ మృతదేహం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.
ఒంటిపై దుస్తులు చిందరవందరగా ఉండటం, మృతదేహం పడి ఉన్న తీరు అనుమానాస్పదంగా ఉందని చెబుతున్నారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పసమలార్, పుదుకవిదై సీరియల్స్ ద్వారా వెలుగులోకి వచ్చింది. వంటల ప్రోగ్రామ్స్ చాలా చేసింది సబర్ణ. మూడు సినిమాల్లో కూడా నటించింది. ఎంతో చలాకీగా ఉంటుందని.. ఫ్రెండ్ షిఫ్ అంటే ప్రాణం ఇస్తుందని స్నేహితులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పరికిది కాదంటున్నారు సన్నిహితులు. సబర్ణ మరణంతో తమిళనాడు ఇండస్ట్రీ షాక్ అయ్యింది. విలక్షణ పాత్రలతో టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సబర్న ఆకస్మిక మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
కాగా ఉడుంబలై పట్టైకు చెందిన సబర్న తల్లి పుష్పలత, తండ్రి ఆనంద్ కుమార్, సోదరుడు పక్కనే ఉన్న విరుగంబాక్కంలో నివాసం ఉంటుండంగా ఆమె ఒంటిరిగా ఉంటోంది. ఒక మ్యూజిక్ ఛానల్ లో టీవీ వ్యాఖ్యాత, యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించిన సబర్న ఆ తర్వాత సినిమాలు, సీరియళ్లలో నటించారు. పూజై, కుదిరసు, కలై లాంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు.