తల్లి కాబోతున్న బుల్లి తెర యాంకర్‌..

778
Anchor Lasya
- Advertisement -

బుల్లి తెరపై తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను అలరించింది యాంకర్ లాస్య. ఈ అమ్మడు పలు టీవీ షోలలో యాంకర్‌గా ఎంతో పాపులరిటీ సంపాదించుకుంది. అంతేకాదు యాంక‌ర్‌గా అల‌రించిన లాస్య ‘రాజా మీరు కేక’ అనే చిత్రంతో వెండితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. ఈ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికి, లాస్య న‌ట‌న‌కి మంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఈ బుల్లి తెర బ్యూటి ఫిబ్రవరి 15.2017లో పెళ్లి చేసుకుంది. అయితే నిన్న (శుక్రవారం) లాస్య పెళ్లి రోజు కావడంతో సోషల్‌ మీడియా ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్‌ చేసింది. అదేంటంటే ఆమె తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని ఫోటోలతో సహా ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలను మేము పొందాము. నేడు(శుక్రవారం) మేము సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నాం. తాను గర్భవతినని వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. లిటిల్ హ‌నీ త్వర‌లోనే మాతో క‌ల‌వ‌నున్నాడు. అప్పుడు మా ఫ్యామిలీ ముగ్గురం అవుతాము అని పేర్కొంది. అంతేకాదు యూ ట్యూబ్ లోను తాను త‌ల్లి కాబోతున్న విష‌యాన్ని తెలిపిన లాస్య త‌న‌కు బాబు కావాల‌నుంద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం 8వ నెల న‌డుస్తుంద‌ని కూడా ఆమె తెలిపింది.

https://youtu.be/rswWV7xQceM

- Advertisement -