రీసెంట్ గా మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఝాన్సీ ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చింది. గతంలో నారాయణమూర్తి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో ఝాన్సీని ఒక క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. ఆ సినిమాలో ఝాన్సీకి మంచి క్యారెక్టర్ కూడా ఇచ్చారట. అయితే కొన్ని రోజులు షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఝాన్సీ క్యారెక్టర్‌ను అర్థాంతరంగా చంపేశారట. దీంతో ఏమైందని ఝాన్సీ నారాయణమూర్తిని అడిగితే.. సెట్‌లో నలుగురితో కూర్చుని నవ్వడం, మాట్లాడడం చేస్తున్నావు. అది నచ్చక నీ క్యారెక్టర్‌ను ముగించేశామని నారాయణమూర్తి చెప్పాడట. దీంతో ఝాన్సీ వెంటనే షూటింగ్ స్పాట్ నుంచి వాకౌట్ చేసిందట.
అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఝాన్సీ నారాయణమూర్తితో మాట్లాడింది లేదట. అంతేకాదు ఆడవాళ్లను తక్కువ చేసే ఏ విషయంలో అయినా విభేదిస్తానని చెబుతోంది ఝాన్సీ. ఒక డైలాగ్ విషయంలో దర్శకుడు సంపత్ నందితో ఇలాగే విభేదించిందట ఝాన్సీ. తర్వాత ఆయన అర్థం చేసుకుని డైలాగ్ మార్చాడట. ఏదేమైనా ఝాన్సీ ఎక్కడా రాజీపడకుండా నెట్టుకొస్తుందని చెప్పుకుంటున్నారు సినీ జనాలు.