రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రోజు రోజుకు పెద్ద ఎత్తున ముందుకు సాగుతుంది. ఈ చాలెంజ్ అని ఎంతో మంది ప్రముఖులు ఆకర్షించి మొక్కలు నాటడానికి ముందుకు రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జబర్దస్త్ ముక్కు అవినాష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ యాంకర్ ధరణి ప్రియా నల్లకుంట లోని తన నివాసం దగ్గర లోని పార్క్ లో మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని మంచి కార్యక్రమాన్ని చేపట్టారని అందులో భాగంగా నేను కూడా మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నేను ఒకటే చెబుతున్నాను మొక్కలు నాటి ఫోటోలు దిగాము అని కాకుండా పెట్టిన చెట్టును రక్షించే బాధ్యతను తీసుకోవాలని. నేను ఈరోజు 3 మొక్కలు నాటానని అందులో ఒక్క మొక్కకు రాధ అని పేరు పెట్టుకున్నా అని ఈ మొక్కలను సంరక్షించే బాధ్యత నీనే తీసుకుంటున్నాను అని తెలిపారు.
అదేవిధంగా అందరు కూడా మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నేను మరొక ముగ్గురు ప్రియాంక (బంగారు కోడలు సీరియల్); ఉదయశ్రీ యాంకర్; సోహెల్ నటుడు వీరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్; నల్లకుంట కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ పాల్గొన్నారు.