అమెరికా సెక్స్ రాకెట్‌పై అనసూయ స్పందన..

1660
Anchor Anasuya
- Advertisement -

తాజాగా అమెరికాలో హీరోయిన్స్ సెక్స్ రాకెట్ బట్టబయలవడంతో టాలీవుడ్‌ పెద్ద షాక్‌ తగిలింది. అమెరికాలో టాలీవుడ్ నటీనటులతో సెక్స్ రాకెట్ నడిపిస్తున్న దంపతులు అరెస్ట్ అయ్యారు. ఈ సంచలనం వెలుగుచూడడంతోపాటు టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నారనే విషయం బయటపడింది. ఈ వివాదాన్ని క్యాష్ చేసుకోవడానికి హాట్ హాట్ గా టీవీ చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటి, యాంకర్ అనసూయ స్పందించింది.

Anchor Anasuya

తెలుగు అసోసియేషన్ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాలంటూ శ్రీరాజ్ అనే వ్యక్తి అమెరికా నెంబర్ తో తనకు ఫోన్ చేసిన విషయాన్ని అనసూయ గుర్తు చేసుకుంది. అతను మాట్లాడే విధానం తనకు నచ్చకపోవడంతో తిరస్కరించానని, అయినప్పటికీ వారు ప్రచురించిన పోస్టర్ లో తన ఫొటోను ముద్రించిన విషయాన్ని ప్రస్తావించింది.

ఆ ఈవెంట్ లో తాను పాల్గొనడం లేదని అప్పట్లో తన ట్విట్టర్ ఖాతా ద్వారా తాను స్పష్టం చేశానని చెప్పింది. చాలా రోజులుగా తాను అమెరికా వెళ్లలేదని చెప్పిన అనసూయ, 2014, 2016లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి ఈవెంట్లకు హాజరైనట్టు పేర్కొంది.

- Advertisement -