నేను అప్పుడే చెప్పా..నాకెవ్వరూ సపోర్ట్ చేయలేదుః అనసూయ

281
Arjun Reddy Contravarcy
- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమా తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. యూత్ నే టార్గెట్ పెట్టుకుని తీసిన ఈసినిమాపై చాలా వివాదాలు తలెత్తాయి. ఈసినిమాలో పలు అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఇదే ఈసినిమా తాజాగా బాలీవుడ్ లో కూడా విడుదలయింది. కబీర్ సింగ్ అనే టైటిల్ తో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అక్కడ కూడా ఈమూవీ భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

తాజాగా ఓఇంటర్యూలో పాల్గోన్న దర్శకుడు సందీప్ రెడ్డి ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ మహిళతో ప్రేమలో ఉన్నప్పుడు ఆమెపై చేయి చేసుకునే స్వేచ్ఛ ఉండాలి. అలా లేనప్పుడు అక్కడ ప్రేమ ఉంటుందని నేననుకోను. నా సినిమాపై విమర్శలు చేసిన మహిళా క్రిటిక్ ని బహుశా ఎవరూ ప్రేమించలేదేమో అంటూ సందీప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఈ వ్యాఖ్యపై గాయని చిన్మయి, సమంత లాంటి ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా అనసూయ కూడా ఈవివాదంపై స్పందించింది. చిన్మయి చాలా శక్తివంతమైన మహిళ. నేను గతంలో సందీప్ మహిళలపై కామెంట్స్ చేసినప్పుడు ఖండించాను. మీరెవ్వరూ నాకు సపోర్ట్ చేయకపోవడంతో చాలా నిరాశ చెందా. కానీ ఇప్పుడు మీరు అతడిని వ్యాఖ్యలని వ్యతిరేకించడం మంచి పరిణామం అని అనసూయ ట్వీట్ చేసింది.

- Advertisement -