యాంకర్ అనసూయ… ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు బుల్లితెరకు గ్లామర్ అద్దిన యాంకర్లలో అనసూయ ముందువరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. అందం, అభినయంతో తనదైన చలాకితనంతో యాంకరింగ్ కే సొగబులు అద్దిన అనసూయ నాలుగు పదుల వయసులోనూ చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులను అలరిస్తున్నారనే చెప్పాలి. ఆమె అందానికి ముగ్దులవ్వని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పెళ్లై ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా.. అనసూయలో ఏమాత్రం వన్నెతగ్గేలేదు. ఇటు యాంకరింగ్ తో పాటు అటు సినిమాల్లో నటిస్తూనే… కమర్షియలో ప్రోగ్రాంతో అనసూయ పుల్ బిజీగా ఉందనే చెప్పాలి.
అయితే తాజాగా అనసూయ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. గ్లామర్ ఫోటో షూట్లతో కుర్రకారు గుండెలను బాంబుల్లా పేలుస్తున్న అమ్మడు… అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో సెన్సేషనల్ పోస్టులు చేస్తూ కాకరేపుతోంది.
Also Read:నింగిలోకి చంద్రయాన్ -3
అలాగే తాను చేసిన పోస్టులకు ఎవరైనా వల్గర్ కామెంట్ చేస్తే అదే రేంజ్‌లో తాట తీస్తుంది ఈ అమ్మడు. గతంలో పలు సందర్భాల్లో నెటిజన్లతో అనసూయకు వాగ్వాదం జరిగిన సందర్భాలున్నాయి. ఏదిఏమైనా సోషల్ మీడియా ద్వారా అందాల విందు చేస్తున్న ఈ అమ్మడికి ఫాన్య్స్ కూడా ఆ రేంజ్‌లోనే ఉన్నారు.
Also Read:జక్కన్న – మహేష్…లేటెస్ట్!