నితిన్ మూవీలో జబర్ధస్త్ యాంకర్!

481
Nithin Anasuya
- Advertisement -

నితిన్ రష్మీక మందన  జంటగా నటించిన చిత్రం భీష్మ. ఈమూవీ బాక్సాఫిస్ వద్ద భారీగా కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఈమూవీ తర్వాత నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే మూవీలో చేయనున్నాడు. ఈచిత్రంతో పాటు మరో మూవీని లైన్ లో పెట్టాడు నితిన్. ఇక తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించాడు. హిందీలో విజయం సాధించిన అంధదూన్ సినిమాను తెలుగులోకి రిమేక్ చేయనున్నారు. ఈమూవీలో నితిన్ హీరోగా నటించనున్నారు. అంతేకాకుండా నితిన్ సొంత బ్యానర్ లో ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.

మేర్లపాక గాంధీ ఈసినిమాకు దర్శకత్వం వహంచనున్నారు. కాగా హిందీ సినిమాలో టబు కీలకమైన పాత్రలో నటించింది. అయితే తెలుగులో ఆ పాత్ర కోసం పలువురు సీనియర్ కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారు. తాజాగా ఉన్న సమాచారం మేరకు జబర్ధస్త్ యాంకర్ అససూయను తీసుకున్నట్లు తెలుస్తుంది. అటు బుల్లితెర ఇటు వెండీతెరపై అనసూయకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఆమెను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

- Advertisement -