అనసూయ అందాలను వర్ణించేశాడట..!

950
- Advertisement -

టాలీవుడ్ లో హీరోయిన్ల పేరు మీద పాటలు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గీత రచయితలు అందాల భామలను ఊహించుకుని సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తుంటారు. రీసెంట్ గా ఓ అందాల యాంకర్ కు ఈ అదృష్టం వరించింది. ఆలోచన వచ్చిందే తడవుగా అనసూయ అందాల్ని పాటలో వర్ణించడం.. అంతే హాట్ గా ఈ భామ నటించడం కూడా జరిగిపోయింది.

Anasuya’s special song in Winner is called Anasuya

యాంకర్ అనసూయ తెరమీద అందాలు ఆరబోసేందుకు ఏమాత్రం వెనకాడదు. కానీ, ఎందుకో ఆచితూచి సినిమాల్లో చేస్తుంది ఈ భామ. కెరియర్ ఆరంభంలోనే ఐటెం సాంగ్స్ చేస్తే తేడా వస్తుందేమోనని పవన్ తో ఛాన్స్ వచ్చినా అప్పుడు అనసూయ వెనకడుగు వేసింది. ఆ తరువాత సొగ్గాడే చిన్నినాయన మూవీలో నాగ్ మరదలిగా మెప్పించిన అమ్మడు, క్షణంలో పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర చేసి, అందరిని ఆకట్టుకుంది. ఆ గ్యాప్ తరువాత మళ్లీ గ్యాప్ తీసుకుని మెగా హీరో సాయిధరమ్ తేజకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విన్నర్ గా వస్తున్న ఈ చిత్రంలో అనసూయ సాయిధరమ్ పక్కన ఐటెం సాంగులో చిందేసింది.

Anasuya’s special song in Winner is called Anasuya

తాజాగా ఈ ఐటెంసాంగును ఉక్రేయిన్ లో చిత్రీకరించారు. ఓ యువ గీత రచయిత ఈ ఐటెంసాంగ్ కు సాహిత్యం అందించాడట. అందాలు వర్ణించడమే పాటలోని కాన్సెప్ట్ కావడంతో, ఆ రచయిత అనుసూయలోని అందచందాలనే పాటలో వర్ణించేశాడట. ఆసనూయ పేరుమీదే పాట రాయడం విశేషం. అనసూయ కూడా అంతే హాట్ గా పాటలో తన అందాలను ఆరబోసినట్లు చెబుతున్నారు. అనసూయకు ఇదే మొదటి ఐటెంసాంగ్. మరీ యువ రచయిత అనసూయ అందాలను ఏవిధంగా వర్ణించాడో.. దానికి అమ్మడు ఎంతలా శృతి మించిందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

- Advertisement -