తెలుగు ‘బిగ్ బాస్ షో’ భారీ అంచనాల మధ్య మొదలైంది. 70 రోజుల పాటు జరగనున్న ఈ షోలో 14 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే వారిని కూడా ఎన్టీఆర్కు తగ్గట్లుగా సెలక్ట్ చేస్తారని భావించారు కానీ షో స్టార్ట్ అయ్యాక వచ్చిన పార్టిసిపెంట్లను చూశాక అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
షో ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్న ఇందులో పాల్గొంటున్న వారి నుంచి ఆశించిన స్థాయిలో జోష్ రావడం లేదని షో నిర్వాహకులు భావిస్తున్నారట. దాంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంచు లక్ష్మిని గానీ .. తేజస్విని గాని పంపించాలని భావిస్తున్నారని సమాచారం.
స్టార్టింగ్ ఎపిసోడ్స్ లోనే షోకి హిట్ టాక్ తీసుకొస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారట. అందువలన సాధ్యమైనంత త్వరగా అనసూయను పంపిస్తే ప్రయోజనం ఉంటుందనేది నిర్వాహకుల ఆలోచనగా తెలుస్తోంది. అయితే తొలుత అనసూయ బిగ్ బాస్ 14 మంది పార్టిసిపేట్స్లో ఉంటుందని వార్తలు వెలువడ్డాయి. కానీ తన బిజీ షెడ్యూల్ వల్ల వీలుపడలేదంట. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్ధితుల్లో ఎంతిచ్చైనా సరే ఈ హాట్ యాంకర్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారట. మరి అనసూయ ఏమంటుందో చూడాలి.
తమిళంలో బిగ్ బాస్ షోని కమల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఈ షోకు అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. హిందీ ప్రేక్షకుల అభిరుచి వేరు, సౌత్ ప్రేక్షకుల అభిరుచి వేరు. తమిళంలో అట్టర్ ఫ్లాప్ కావడం….కొన్ని తమిళ సంఘాల నుంచి నిరసనలు వ్యక్తమవడంతో ఈ షోపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన తెలుగు షో కూడా రేంజ్లో ఉండటంతో స్పందించిన నిర్వాహకులు షోకి ఊపు తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు.