ఇప్పుడు బుల్లి తెర యాంకర్లకు అందాలు ఆరబోయడం అనేది పెద్ద ఎసెట్ గా మారింది. ఇప్పుడు అదే తరహాలో మోస్ట్ గ్లామర్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనసూయ. వయసుతో సంబంధం లేకుండా ఈ భామ వేసే డ్రెస్సులకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాగే సినిమాల్లో స్పెషల్ రోల్స్, ఐటం సాంగ్స్ చేస్తూ అలరిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ హాట్ యాంకర్ కి ఊహించని షాక్ ఇచ్చాడు ఓ అభిమాని.
వివరాల్లోకి వెళ్తే, ఫేస్ బుక్ లైవ్ లో తన అభిమానులతో ముచ్చటించింది అనసూయ. ఈ సందర్భంగా చాలా మంచి పాత్రలు చేస్తున్నారంటూ ఓ అభిమాని కితాబిచ్చాడు.
మరో అభిమాని మాత్రం… మేకప్ లో మీరు చాలా అందంగా ఉంటారని, మేకప్ లేకపోతే చాలా అసహ్యంగా ఉంటారని అన్నాడు. దీంతో, అనసూయ తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ‘నన్నే ఇలాగంటే… మీరు ఎలా ఉంటారో’ అంటూ సమాధానమిచ్చింది.
ఇంతకు ముందు సెలబ్రిటీలు ఎప్పుడు బయటకు వస్తారా? అంటూ వాళ్ల ఇంటి ముందు అభిమానులు పడిగాపులు పడేవారని… ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మాకు మేమే వచ్చి మీతో మాట్లాడుతుంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.