అర్జున్ రెడ్డిపై అనసూయ ఫైర్…

491
Anchor Anasuya upset with Vijay Devarakonda
- Advertisement -

అనసూయ అంటే మన తెలుగు రాష్టాలలో తెలియని వారు  ఎవరూ ఉండరంటే అది అతిశయోక్తి కాదు. ఈ ముద్దుగుమ్మ బుల్లి తెరమీద ఎంత పాపులర్ అయిందో మనందరికి తెలిసిందే. ఈ టీవీలో ప్రసారమైన జబర్దస్ కామెడీ షోతో మరింత పాపులర్‌గా మారింది ఈ బ్యూటీ. అందం, అభినయంతో ఇమేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ టాప్ యాంకర్   సినిమా ఆఫర్లతో వెండితెరపై కూడా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది.

Anchor Anasuya upset with Vijay Devarakonda

అయితే ఈ అమ్మడు ఎప్పుడూ ఏదో ఒక విషయంలో నిత్యం వార్తల్లో ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సంచనాలు సృట్టిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ పై అనసూయ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘అంతా బాగానే ఉంది, కానీ అమ్మను తిట్టడం కూడా ఓకేనా ? కరెక్టే ఇదో ప్రయోగమే కానీ ఇలా చేసేయచ్చని ఎలా అనుకుంటారు, దీన్ని నేను ఇష్యూ చేయాలని అనుకోవడం లేదు. కానీ సైలెంట్ గా ఉండడం నావల్ల కాలేదు. ఇది చాలా చీప్ గా ఉంది’ అంటూ వ్యూహాత్మకంగా అర్జున్ రెడ్డిని కామెంట్ చేసింది.

Anchor Anasuya upset with Vijay Devarakonda

‘మాద..ద్‌’ అనేది వాడుక పదం అయిపోయినట్టు దానిని జోక్‌గా వాడేస్తున్నారు పిల్లలు. ఆ విధంగా వాళ్లని రెచ్చగొట్టిన విజయ్‌ దేవరకొండపై విరుచుకుపడింది నటి అనసూయ. ‘మీ ఆడవాళ్లని ఎవరైనా దూషించినా, వారితో చెడుగా ప్రవర్తించినా వాళ్ల తల్లుల్ని తిట్టమని చెబుతున్నావా? ఇదేమి పద్ధతి. నువ్వు ఎదగాలి డూడ్‌’ అంటూ అనసూయ డైరెక్టుగా విజయ్‌ దేవరకొండకే చెప్పేసింది. ఈ సినిమా తాను ఇంకా చూడలేదని, చూడాలని వున్నా కానీ ఈ మాటలతో ప్రభావితమైన జనం ఎక్కడ ఆ మాట థియేటర్లలో అరుస్తుంటారో అనే భయంతో సినిమాకి వెళ్లలేదని అనసూయ చెప్పింది.

Anchor Anasuya upset with Vijay Devarakonda

అర్జున్‌ రెడ్డి బృందం చాలా ప్రతిభావంతమైనదని, వాళ్ల టాలెంట్‌ని సినిమాల్లో చూపించాలే తప్ప ఇలా పబ్లిక్‌లో మాట్లాడడం తగదని హితవు చెప్పింది. మరి దీనికి విజయ్‌ దేవరకొండ ఏమంటాడో? తన స్టయిల్లో ‘ఆంటీ చిల్‌’ అంటాడా లేక తన తప్పు ఉందని అంగీకరించి క్షమాపణలు  అడుగుతాడా అనేది చూడాలి.

- Advertisement -