సిల్క్ స్మిత బయోపిక్‌లో అనసూయ..!

192
anasuya
- Advertisement -

యాంకర్‌, సినీ నటి అనసూయ భరద్వాజ్‌ నటిగా మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు వరుసగా ఆఫర్‌లు అందిపుచ్చుకుంటోంది. ఆమధ్య ‘రంగస్థలం’ సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర ఆమెకు ఎంతో పేరుతెచ్చింది. ఈ నేపథ్యంలో అనసూయకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజగా తమిళంలో ఓ చిత్రాన్ని అంగీకరించింది ఈ బ్యూటీ.

‘మరో మంచి కథ.. కొత్త ఆరంభం .. కోలీవుడ్.. తమిళ్..’ అంటూ తాజాగా అనూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ ఓ ఫొటో కూడా పోస్ట్ చేసింది. ఇందులో అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ పోజు ఇచ్చింది. ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతితో కలసి ఆమె నటించనుందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసమే ఇటీవల ఆమె చెన్నై వెళ్లినట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమా ఒకప్పటి శృంగారతార సిల్క్ స్మిత బయోపిక్ గా రూపొందనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

- Advertisement -