కన్నడలో బిజీగా అనసూయ..!

288
Anasuya Bharadwaj busy in kannada movies..!
- Advertisement -

తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతోంది అనసూయ. బుల్లి తెరపై చాలామంది యాంకర్లు గా కెరియర్‌ మొదలుపెట్టి కొద్దికాలానికే.. సినిమాలో ఛాన్స్‌ రావడంతో యాంకరింగ్‌కి గుడ్‌బై చెప్పేస్తారు. కానీ యాంకర్‌ అనసూయ మాత్రం అటు బుల్లి తెరపై అలరిస్తునే ఇటు వెండితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. బుల్లితెరపై తనదైన స్టైల్‌లో యాంకర్‌గా దూసుకుపోతు అలాగే వెండి తెరపై కూడా నచ్చిన పాత్రలు వచ్చినప్పుడల్లా ఆమె మెరుస్తూనే వుంది. ఇదే క్రమంలో టీవీ న్యూస్ యాంకర్ గా వెలుగులోకి వచ్చిన ఈమె ఇప్పుడు స్టార్ హీరోలు వెయిట్ చేసేంత స్థాయికి ఎదిగింది.

తెలుగులో ‘క్షణం’ .. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాల్లో నటించిన అనసూయ, ప్రాధాన్యత కలిగిన పాత్రతో ముడిపడిన స్పెషల్ సాంగ్ చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని అప్పట్లోనే చెప్పింది. ఆ తరువాత ‘విన్నర్’ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది కూడా.

ప్రస్తుతం ‘రంగస్థలం’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తోంది. తెలుగులో ఆమె పెద్దగా సినిమాలు అంగీకరించకపోవడానికి కారణం, టీవీ షోలతో బిజీగా వుండటమేనని అనుకున్నారు. కానీ ఆమె కన్నడ సినిమాలతో బిజీగా వుండటం ప్రధాన కారణమనేది తాజా సమాచారం. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను కన్నడ సినిమాలు వున్నాయట. ఆ సినిమాలు పూర్తయిన తరువాత ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెడుతుందేమో చూడాలి.

- Advertisement -