అనంత్ – రాధిక పెళ్లి డేట్ ఫిక్స్!

5
- Advertisement -

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ – నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. జూలై 12న రాధిక మర్చంట్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు అనంత్ అంబానీ. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ ప్లాజా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు.

మూడు రోజుల పాటు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు జరగనున్నాయి. జులై 12న మొదలై.. జులై 14న (ఆదివారం) మంగళ ఉత్సవ్‌ (రిసెప్షన్‌)తో ముగియనుంది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు అనంత్‌ అంబానీ వివాహం నేపథ్యంలో ఇప్పటికే ఆ ఇంట వేడుకలు మొదలయ్యాయి. ఈ ఏడాది మార్చిలో వీరి ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ కూడా అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. గుజరాత్‌ జామ్‌ నగర్‌లో జరిగిన ఈ వేడుకలకు దేశ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.

Also Read:బాలయ్య 109.. టైటిల్ టీజర్?

- Advertisement -