- Advertisement -
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. ముఖేష్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ పెళ్లి సందడి మొదలైంది.
మూడు రోజుల పాటు జరిగే ఈ వివాహ వేడుకకు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. జులై 12న శుభ్ వివాహ్, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్ వంటి సంప్రదాయ కార్యక్రమాలుంటాయి. దేశ,విదేశాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ వివాహం కోసం ఏకంగా రూ. 4,000-5,000 కోట్లు ఖర్చు ఉండనుందని అంచనా. ఈ వేడుక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటిగా నిలువనుంది.
పెళ్లి ఇన్విటేషన్ కార్డు ఖర్చే రూ.7 లక్షలు కాగా 2500 మందికి పైగా ముఖ్యమైన అతిథులను ఆహ్వానించారు.
- Advertisement -