కరోనా పాజిటివ్ ఉన్న వారు రావొద్దు: ఆనందయ్య

25
anand

కరోనా పాజిటివ్ ఉన్న వారు మందు కోసం రావోద్దని కోరారు ఆనందయ్య. ఇక ఏపీ ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని…ప్రభుత్వ సహకారంతో మందు పంపిణీ చేస్తానని వెల్లడించారు. మూడు రోజుల్లో తమ కుటుంబ సభ్యులు, అధికారులతో చర్చించి ముందు ఎప్పుడు పంపిణీ చేసిందో వెల్లడిస్తానని తెలిపారు. మొదటగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చి ఇతరులకు పంపిణీ చేస్తానని వెల్లడించారు.

దేశం మొత్తం మందు పంపిణీ చేస్తానని తెలిపిన ఆనందయ్య… పోలీసులు తనను నిర్బంధించలేదని, రక్షణ కల్పించారని..ఉన్నవాళ్ళకి కాదు లేని వాళ్లకు కూడా మందు పంపిణీ చేశానన్నారు. మందుకు కావలసిన వనమూలికలు సమృద్ధిగా ఉన్నాయని..ఇప్పటి వరకు 50 వేల మందికి పంపిణీ చేశానని పేర్కొన్నారు.