- Advertisement -
తెలంగాణకు చెందిన కలెక్టర్ దేవరకొండ కృష్ణ భాస్కర్‌పై ప్రశంసలు గుప్పించారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. యువ ఐఏఎస్ అధికారి డి.కృష్ణ భాస్కర్ కథనాన్ని పంచుకున్న ఆయన ఆ అధికారి నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతున్నట్లు తెలిపారు.
వ్యవసాయ రంగం గురించి మనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది… భూగర్భ జలాల స్థాయిలను పెంచడంలో దేశం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో మన అందరికీ బాగా తెలుసు అని కితాబిచ్చారు.
యువ ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్ సాధించిన విజయాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే… సమస్య ఎలాంటిదైనా దాన్ని అధిగమించగలమని మనలో విశ్వాసాన్ని నింపగలిగారు అన్నారు. దానికి కావాల్సిందల్లా దృఢ సంకల్పమే అని రుజువు చేశారు. అందుకే ఆయనే నా మండే మోటివేషన్ అని మహీంద్రా ప్రశంసలు కురిపించారు.
Also Read:ప్రధాని మోడీ..రంజాన్ విషెస్
- Advertisement -

