సిక్స్ ప్యాక్ లో ఆనంద్ దేవరకొండ

16
- Advertisement -

తన ప్రతి సినిమాకు కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ వస్తున్నారు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఈసారి “గం..గం..గణేశా” కోసం తన లుక్ కూడా మార్చేశారు. ఆయన ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు. సిక్స్ ప్యాక్ తో తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆనంద్ దేవరకొండ. “గం..గం..గణేశా” యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా ఈ నెల 31న థియేటర్స్ లోకి రాబోతోంది.

ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ట్రైలర్ ను రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ మంత్ ఎండ్ లో వస్తున్న చిత్రాల్లో ఒక కొత్త ప్రయత్నంగా “గం..గం..గణేశా” ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.

- Advertisement -