ఆనంద్ దేవరకొండ @ ‘గం గం గణేశా’

96
gam gam ganesha
- Advertisement -

ఇటీవలె పుష్పక విమానంతో మెప్పించిన ఆనంద్ దేవరకొండ తన కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. ఇప్పటికే హైవే థ్రిల్లర్‌లో నటిస్తున్న ఆనంద్…తన నెక్ట్స్‌ సినిమా టైటిల్‌ను గం గం గణేశా అనే టైటిల్‌ని ఖరారు చేశారు. దీనిని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు.

యాక్షన్ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది అని పోస్టర్‌పై రాసి ఉండగా టైటిల్ ఫాంట్‌లో కొన్ని తుపాకీలను చూపిస్తూ మేకర్స్ ఇచ్చిన హింట్ చూస్తుంటే ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు కనిపిస్తోంది.

ఉదయ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

- Advertisement -