డేరా బాబు.. ఓ వింత ప్రపంచం

215
An Exclusive Look At Ram Rahim's Fantasy World
- Advertisement -

డేరా సచ్చా సౌధా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ లీలలు మాములుగా లేవు. ప్రస్తుతం అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఈ డేరాబాబు.. డేరా లోపల ఏర్పరుచుకున్న సౌకర్యాలు చూస్తే మతి పోతుంది. సచ్చా సౌధా పేరిట ఉన్న సుమారు 700 ఎకరాల ప్రాంగణంలో ప్రపంచంలోని ఏడు వింతలను నిర్మించాలనుకున్నాడు. ఈఫిల్ టవర్, తాజ్‌మహల్, డిస్నీ‌ల్యాండ్‌, క్యాంపస్‌లో రిసార్ట్స్, మొఘల్ కోర్ట్స్‌నమునాలను నిర్మించుకున్నాడు. గుర్మీత్ డేరాలో ఎంతటి విలాసవంతమైన జీవితం గడిపాడో ఆ ప్రదేశాన్ని వీక్షిస్తే ఇట్టే స్పష్టమవుతుందని అంటున్నారు.

fab5abee-3da6-417e-a5a9-a5f63027bb04

డేరా క్యాంపస్ భారీ ఓడ సైతం నిలిపి ఉంది. అక్కడే ఓ పెద్ద ఫిల్మ్ సిటీని కూడా నిర్మించి, తన సినిమాలన్నీ ఇక్కడే షూటింగ్ చేసుకునేవాడట. అయితే ఈ ఫిల్మ్ సిటీలోకి ఎవరికి అనుమతి లేదట. అంతేకాదు ఎవరూ లోపల ఏం జరుగుతుందో తెలియకుండా ఏర్పాట్లు చేసుకున్నాడట. విదేశీ అనుచరుల కోసం డేరా బాబా ఏకంగా ఇక్కడ అండర్ వాటర్ విల్లా నిర్మిస్తున్నారు. అద్భుత ఇంజనీరింగ్ ప్రమాణాలతో నీటిలోపల భారీ రిసార్ట్ను నిర్మించేందుకు బాబా చేసిన ప్లాన్ ఆయన అరెస్ట్ తో అటకెక్కింది. సింపుల్‌గా చెప్పాలంటే ఆయన ఓ ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు.. దానికి టెక్నాలజీ ఏర్పాటు రెడీ అయ్యాడు. ఇంతలోనే దొరికిపోయాడు.

9589d145-ea0a-4828-a0d1-bac1a89a5da0

కాగా డేరా సచ్చా సౌధా ప్రధాన కార్యాలయంలో భద్రతాదళాలు సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్-హరియాణా హైకోర్టు ఆదేశాలు మేరకు భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. సిర్సాలోని డేరా సచ్చా సౌధా ప్రధాన కార్యాలయం పరిసరాల్లో కర్ఫ్యూ విధించారు. పారామిలటరీ కంపెనీలు సహా ఆర్మీ, పోలీసు సిబ్బంది, బాంబా స్వాడ్‌తో తనిఖీ చేస్తున్నారు.

98b97b99-19a1-494b-83ff-c535046eea7d

- Advertisement -