Bigg Boss 8: బిగ్ బాస్‌లోకి అమృత ప్రణయ్?

14
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొనే వారెవరూ అనేదానిపై రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా మిర్యాలగూడకు చెందిన అమృత ప్రణయ్ ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి రానుందనే ప్రచారం జరుగుతోంది.

సెప్టెంబర్ 1న 8వ సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తోండగా ఈ సీజన్‌లో అమృత ప్రణయ్ కంటెస్టెంట్‌గా రానుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి అమృత గతంలోనే సినిమాల్లోకి వస్తుందని ప్రచారం జరిగినా అలాంటిదేమి జరగలేదు. తాజాగా బిగ్ బాస్ లోకి అమృత రానున్నట్లు ప్రచారం చేస్తుండగా దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

ఇప్పటికి మిర్యాలగూడ ఘటన అనగానే గుర్తుకొచ్చేది అమృత – ప్రణయ్‌. ప్రెగ్నెంట్‌తో ఉన్న అమృతను హాస్పిటల్‌కు ప్రణయ్ తీసుకెళ్లి వస్తుండగా దారుణం చోటు చేసుకోగా ఆ తర్వాత అమృత…బాబుకు జన్మనిచ్చింది.

Also Read:పేమెంట్ కోటాలో వచ్చావా?, రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్

- Advertisement -