సెల్ఫీ కోసం హద్దు దాటిన సీఎం భార్య

445
Amrutha-Fadnavis
- Advertisement -

చేతిల సెల్‌ఫోన్‌ లేనోళ్లు కనబడ్డరా మీకు.. కనపడితే వాళ్లను ఓ వింత జీవులను చూసినట్టు చూస్తరు కదా.. ఫోన్లతోని పొద్దెళ్లదీసెటొళ్లు ఎంత మంది ఉన్నరో ఎరుకన..దాదాపు 100 కోట్ల మదది తాన సెల్‌ ఫోన్లు ఉన్నయట. మరి గంతోని తాన సెల్‌ఫోనేనాయే.. గింతోని తాన సెల్‌ఫోనేనాయే.. జేబులో రూపాయి లేనోడు కూడా సెల్‌పోన్‌ కావాలంటడు.10 రూపాల బ్యాలెన్స్‌ కార్డు కొననోడు కూడా చేతిల పట్టనంత ఫోన్‌ పట్టుకుని తిరుగుతడు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చేతికి కొబ్బరి చిప్పదొరికినట్టే.

amruthafadnavis

చేతిల సెల్‌ఫోన్‌ ఉన్నదంటే చాలు సెల్ఫీఫోటోలు దిగుతరు జనాలు. సెల్ఫీ ఫోటోలు దిగే గజ్జి పట్టింది పబ్లిక్‌కు. మనిషికి తిండి ఎంత ముఖ్యమైందో సెల్ఫీ ఫోటోలు కూడా అట్టయినయి కొందరికి. యాడున్నా టిక్క టిక్క సెల్ఫీ ఫోటోలేనాయే. ఈ స్మార్ట్‌ఫోన్ల కాలంలో సెల్ఫీల మోజు లేనిదెవరికి? సెలబ్రిటీలైనా, రాజకీయ నేతలైనా మంచి సెల్ఫీ కోసం తెగ ఆరాటపడుతరు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ కూడా ఓ మంచి సెల్ఫీ కోసం హద్దు మీరారు. మన దేశంలోని తొలి లగ్జరీ క్రూయిజ్ షిప్ ఆంగ్రియా ప్రారంభం సందర్భంగా ఆమె రక్షణ గోడను దాటి ముందుకెళ్లి మరీ సెల్ఫీ ఫోటోలు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఆమెను హెచ్చరించాల్సి వచ్చింది. ఓ పోలీస్ అధికారి అలా చేయొద్దని వారించినా.. ఆమె పెద్దగా పట్టించుకోకుండా సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన 31 సెకన్ల వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ ముఖ్యమంత్రి భార్య అమృత ఫడ్నవీస్ చాలా బాధ్యతారహితంగా వ్యవహరించారంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఆమెపై మండిపడుతున్నారు. క్రూయిజ్ టూరిజాన్ని వృద్ధి చేయడంలో భాగంగా ఇవాళ ఈ షిప్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు.

- Advertisement -