`అమ్మో అమ్మోరు` టీజ‌ర్ లాంచ్‌..

258
- Advertisement -

మ‌నీష్ గౌర్ హాలీవుడ్ ఫిలింస్ ప‌తాకంపై మ‌నీష్ గౌర్ స‌మ‌ర్ప‌ణ‌లో అమ్మ‌యి ర‌సజ్ఞ టైటిల్ పాత్ర‌లో శ్రీరాజ్ గౌడ్, పూజ జంటగా రూపొందుతున్న చిత్రం `అమ్మో అమ్మోరు`. ఈ చిత్రం టీజ‌ర్ లాంచ్ ఆవిష్క‌ర‌ణ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో లాంచ్ అయింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ…“సంగీత ద‌ర్శ‌కుడు అర్జున్ నా తొంభై సినిమాల‌కు సంగీతాన్ని అందించారు. ` అమ్మో అమ్మోరు` చిత్రానికి కూడా త‌నే మ్యూజిక్ చేశారు. టీజ‌ర్ చాలా బాగుంది. ద‌ర్శ‌కుడు రాముకి, నిర్మాత‌ల‌కు, ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సినిమా మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నా“ అని అన్నారు.

Ammo Ammoru Movie

మ‌రో అతిథి సాయి వెంక‌ట్ మాట్లాడుతూ….“టీజ‌ర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. అమ్మోరు పాత్ర‌లో ర‌స‌జ్ఞ ఇమిడిపోయింది. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ సినిమా మంచి పేరు తీసుకరావాల్నారు. సంగీత ద‌ర్శ‌కుడు అర్జున్ మాట్లాడుతూ….“ఈ చిత్ర ద‌ర్శ‌కుడు రాము నాకు చాలా కాలంగా మంచి మిత్రుడు. సినిమా చాలా బాగా తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో నాలుగు పాట‌లు ఉన్నాయి. దేవుడికి , దుష్ట శ‌క్తికి జ‌రిగే పోరాట‌మే ఈ చిత్రం. పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతానికి కూడా ప్రాధాన్య‌త ఉంద‌ని“ చెప్పారు.

అమ్మోరు పాత్ర ధారి బేబి ర‌స‌జ్ఞ మాట్లాడుతూ…“అమ్మోరు పాత్ర చేసే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, సపోర్ట్ చేస్తోన్న మా కుటంబ స‌భ్యులకు ధ్యాంక్స్ “ అన్నారు. నిర్మాత బియ‌న్ రెడ్డి మాట్లాడుతూ…“రాము మంచి క‌థ‌తో ఈ సినిమా చేశాడు. టీజ‌ర్ అంద‌రికీ న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. సినిమా మొత్తం పూర్త‌యింది. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా“ అన్నారు. హీరో శ్రీరాజ్ గౌడ్ మాట్లాడుతూ…“ఇది నా ఫ‌స్ట్ ఫిలిం. రాము చాలా బాగా డీల్ చేసారు. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌న్నారు`

Ammo Ammoru Movie

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ పూజ‌, ద‌ర్శ‌కులు హ‌రిబాబు, అళ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు. సుంద‌ర‌మ్మ‌, ర‌వి, నీర‌జ్ రెడ్డి, విజ‌య‌లక్ష్మి , కృష్ణ‌వేణి, విజ‌యదుర్గ‌, రాణి, భార్గ‌వ్, అయ్య‌ప్ప త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం; అర్జున్‌; కెమెరాః పి.నారాయ‌ణ నాయుడు; కొరియోగ్ర‌ఫీః వినోద్‌; స‌హ‌నిర్మాత‌లుః ప్ర‌వీణ్ కుమార్‌, న‌వీన్ కుమార్‌, ధ‌ర‌ణిధ‌ర్‌, దేవా; నిర్మాత‌లుః బి.య‌న్‌.రెడ్డి; క‌థ‌-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం; టి.రాము.

- Advertisement -