అమ్మ నాన్నల ఇల్లు..ఓ పుణ్యక్షేత్రం!

3
- Advertisement -

ప్రపంచములో…. ఆహ్వానం లేకుండా…. మనం… ఎన్నిసార్లు అయిన వెళ్ళగలిగే ఇల్లు అమ్మ నాన్నలు ఉండే ఇల్లు. ఈ ఒకే ఇల్లు ఒక్కటే… స్వతంత్రముగా…. మనమే తాళం తీసికొని…. నేరుగా ఇంటిలోకి ప్రవేశించవచ్చు.

ఈ ఇల్లు…. ఒక్కటే…. ప్రేమతో నిండిన కళ్లతో…., మీరు కనిపించే వరకు…. మీ కోసం…. తలుపు వైపు చూడటానికి సిద్ధంగా ఉంటుంది.మీ చిన్ననాటి ప్రేమ, అప్యాయత, అనురాగము, అనందం మరియు స్థిరత్వం…. మరచి పోకుండా… గుర్తు చేసే ఇల్లు.

ఈ ఇంట్లో మాత్రమే…. మీరు తల్లి, తండ్రుల ముఖాలను చూస్తూ…. ఉండటం…. ఒక పూజ అనుకుంటే మరియు వారితో మీరు మాట్లాడటం… వెంటనే లభించే పూజ ఫలితం.మీరు ఆ ఇంటికి వెళ్లకపోతే…. ఆ ఇంటి యజమానుల (అమ్మ నాన్నలు ) మనస్సులు…. కృశించి…. గుండెలు…. గూడలుగా మారతాయి.
మీరు నొప్పించినా…. వాళ్లు బాధపడతారు.

ఈ ఇల్లు…. ప్రపంచాన్ని చూడటానికి…., ఉన్నతముగా జీవించడానికి మరియు మీ జీవితాన్ని ఆనందంతో నింపడానికి… దీపాలు వెలిగించి నిత్యం దైవాన్ని ప్రార్థించిన ఇల్లు. ఈ ఇంటిలో తినే భోజనం మీకు ఎంతో స్వచ్ఛమైనది… మరియు ప్రపంచములో ఉన్న కపట వికారాలకు…. స్థలమే లేనిది.ఇక్కడ మాత్రమే… మీరు భోజన సమయానికి తినకపోతే…. ఆ ఇంటి యజమానుల గుండెలు విరగిపోతాయి మరియు బాధపడతాయి.

ఈ ఇంట్లోనే…. మీకు అన్ని పరిపూర్ణమైన నవ్వులు మరియు సంపూర్ణ ఆనందాలు దొరుకుతాయి.కారణాలు ఏవయినా కావొచ్చు…. ఈ ఇళ్లకు దూరమవుతున్న…. పిల్లలారా…. ఈ అమ్మ నాన్నల ఇల్లు విలువ తెలుసుకోండి…. ఆలస్యం కాకముందే….తల్లిదండ్రులతో గడుపుతూ…. మరియు తరచూ ఆ దేవాలయం లాంటి ఆ ఇంటికి ఎప్పుడూ… అందుబాటులో ఉండే ఆవకాశం ఉన్నవారే అదృష్టవంతులు,ధన్యులు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:కాంగ్రెస్ 420 హామీలపై వినూత్న నిరసన

- Advertisement -