మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత..వీర రాఘవ’. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా హారిక-హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు చిత్ర బృందం.
ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన హైదరాబాదులోని నొవాటెల్‌లో ఆడియో వేడుక నిర్వహించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ అడియో వేడుకకు నందమూరి బాలకృష్ణ గానీ మహేష్ బాబు గానీ ఎవరో ఒకరు ముఖ్య అథితిగా హాజరవుతారనే వార్తలు నిన్నటిదాకా వినిపించాయి. అయితే అనూహ్యంగా మరొకరి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.
అమితాబ్ అరవింద సమేత ఆడియో వేడుకకు వస్తున్నట్టు ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆయనే రావడానికి కారణం లేకపోలేదు. అరవింద సమేతలో బిగ్ బీ ఓ ముఖ్య పాత్ర పోషించారని, అయితే ఈ విషయాన్ని సినిమా విడుదలయ్యే వరకూ సీక్రెట్‌గా ఉంచి ప్రేక్షకులకు, అభిమానులకు సర్ప్రైస్ ఇవ్వాలని చిత్ర వర్గం భావిస్తోందని సమాచారం.