కాశ్మీర్ సమస్యపై ఉద్రిక్తత కొనసాగుతుంది.కాశ్మీర్ పై అసలు కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతుందని అందరిలో ఉత్కంఠ నెలకొంది. కొద్ది సేపటి క్రితమే ప్రధాని సమక్షంలో కేంద్ర కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో మోడీతో పాటు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కశ్మీర్ పై ఏ విధమైన వ్యూహాలను అమలుచేస్తే, ఎటువంటి సమస్యలు వస్తాయన్న విషయంపైనే ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కాశ్మీర్ అంశంపై పార్లమెంట్ అమిత్ షా పార్లమెంట్ ఉభయ సభల్లో స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈఅంశంపై అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడబోతున్నారని సమాచారం. తీవ్ర వివాదాస్పదమైన ఆర్టికల్ 35ఏను రద్దు చేయవచ్చనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. మంత్రిమండలి భేటీకి ముందు అమిత్ షా ఇదే విషయమై మరో మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో చర్చలు జరిపారు. కాశ్మీర్ సమస్యపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మరికొద్ది గంటల్లోనే తేలనుంది.