వరద పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి ఆరా

5
- Advertisement -

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఇప్పటి వరకు జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు సీఎం. సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరదలతో వాటిల్లిన నష్టాన్ని వివరించారు సీఎం రేవంత్. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని..అవసరమైన తక్షణ సహాయం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

Also Read:భారీ వర్షాలు..86 ట్రైన్స్ రద్దు

- Advertisement -