కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం టూర్ ఖరారైంది. ఈ నెల 29న షా ఖమ్మంకు రానుండగా భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తోంది బీజేపీ. వాస్తవానికి గత నెల 15న ఖమ్మంలో బహిరంగసభకు అమిత్ షా హాజరుకావాల్సి ఉండగా ఆ కార్యక్రమం వాయిదా పడింది.
తాజాగా ఈనెల 29న అమిత్ షా ఖమ్మం పర్యటన ఖరారు కావటంతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు కాషాయ నేతలు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ పగ్గాలను కేంద్ర పార్టీ అధిష్టానం అప్పగించింది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలకు కీలక పదవులు అప్పగించింది. దీంతో ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతోంది బీజేపీ.
Also Read:భారత్ – వెస్టిండీస్ తొలి టెస్టు
ఇక అమిత్ షా పర్యటన సందర్భంగా పలు రంగాల ప్రముఖులను కలిసేందుకు నిర్ణయించారు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులను షా కలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడనుంది.
Also Read:భోళా శంకర్…జామ్ జామ్ జజ్జనక