అమితాబ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం..

527
amithabh
- Advertisement -

భారతదేశం గర్వించదగ్గ ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ను ప్రతిష్ఠాత్మ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. రెండు తరాల ప్రజలను తన నటనతో ఉర్రూతలూగిస్తున్న అమితాబ్ బచ్చన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్ ట్విట్టర్ లో వెల్లడించారు.

యావత్ భారతావనికే కాకుండా అంతర్జాతీయ సమాజం కూడా సంతోషపడే విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ కు హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. అదేవిధంగా అమితాబ్ ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించడంపై ఆయనకు టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

https://twitter.com/MPsantoshtrs/status/1176507153563049984

- Advertisement -