‘బ్రహ్మాస్త్రం’ నుండి బిగ్ బీ ఫస్ట్‌లుక్‌..

131
Amitabh
- Advertisement -

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ”బ్రహ్మాస్త్ర”. ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ , ప్రైమ్ ఫోకస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం రూపొందుతున్న ఈ సినిమా మూడు భాగాలుగా రానున్నది. ఈ మూవీలో రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున , ఆలియాభట్, మౌనీ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ”బ్రహ్మాస్త్రం పార్ట్ వన్: శివ” సినిమా 2022 సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రణబీర్, అలియా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఇటీవల వచ్చిన ట్రైలర్ గ్లింప్స్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చింది. జూన్ 15న థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు మేకర్స్‌..ఇక ఈరోజు తాజా అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభాస్త్ర: కాంతి కత్తిని కలిగి ఉన్న తెలివైన నాయకుడుగా.. ‘గురు’ గా అమితాబ్‌ను పరిచయం చేశారు. పోస్టర్‌లో బిగ్ బీ కాంతి కత్తిని ఆయుధంగా చేసుకొని పోరాడటానికి సిద్ధంగా ఉన్న శక్తివంతమైన అవతారంలో కనిపిస్తున్నాడు.

- Advertisement -