మత మార్పిడులను నిరోధించాలని..ఆలయాలు,ఆశ్రమాల ఆస్తుల ఆక్రమణలను అడ్డుకోవాలని బీజేపీ చీఫ్ అమిత్ షాకు వినతపత్రం అందించారు సాధువులు. హైదరాబాద్ కాచిగూడలో శ్యాంబాబా మందీర్‌ను సందర్శించారు అమిత్ షా. ఈ సందర్భంగా పలువురు సాధువులతో సమావేశమయ్యారు. ఆలయాలు,ఆశ్రమాల ఆస్తుల ఆక్రమణను అడ్డుకోవడానికి చట్టం తీసుకురావాఆలని కోరారు. లింగ సంపర్కం, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, వివాహేతర సంబంధాలు వంటి అంశాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు హిందూమత విశ్వాసాలు, ధర్మాలపై ప్రభావం చూపేలా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అమిత్‌షా సాధువులకు హామీ ఇచ్చారు.
అనంతరం కరీంనగర్ అంబేద్క్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన అమిత్ షా..కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుందని మండిపడ్డారు .భూతద్దం పెట్టి వెతికిచూసినా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఉందో కనిపించే పరిస్థితి లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ నీచరాజకీయాలు చేస్తున్నదని, తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంతిమ సంస్కారానికి కనీసం ఢిల్లీలో స్థలం కూడా ఇవ్వని నీచ సంస్కృతి ఆ పార్టీదని విమర్శించారు. ఎంఐఎం పార్టీకి, ఆ పార్టీ అధినేత ఓవైసీకి వ్యతిరేకంగా నిలబడే దమ్ము మహాకూటమికి ఉందా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసినా ప్రత్యామ్నాయం కాలేరన్నారు. దేశాన్ని విభజించి పాలించాలనే పార్టీల వైపు ఉంటారో దేశాన్ని నిర్మించే పనిలో ఉన్న మోడీ వైపు ఉంటారో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దాదాపు 40 లక్షలమంది చొరబాటుదారులను వెనక్కు పంపించేందుకు ప్రయత్నిస్తుంటే ఆ పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.