బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెలికాప్టర్ దిగుతుండగా కిందపడ్డారు. ఈ ఘటన మిజోరం లో గురువారం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం మిజోరంలో ప్రచారానికి వెళ్లారు. వెస్ట్ తుమ్ పూర్ నియోజకవర్గంలోని త్లబంగ్ గ్రామానికి ఆయన హెలికాఫ్టర్ లో వెళ్లారు. దింతో హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఆయన మెట్ల మీది నుంచి దిగుతుండగా అడుగు తప్పుగా వేయడంతో బొక్కబోర్లా పడ్డారు.

హెలికాప్టర్లో ఆయనతో పాటు ఉన్న మరో వ్యక్తి వచ్చి అమిత్ షాను లేపాడు. ఆయన దుస్తులకు అంటిన దుమ్మును దులుపుకుని సభ ప్రాంగణానికి వెళ్లారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈఘటనను అక్కడ ఉన్న వారు ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అమిత్ పా కింద పడ్డ ఫోటో వైరల్ గా మారింది. మిజోరాంలో ఈనెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

