హాట్ సమ్మర్ లో కూల్‌గా ‘అమీ తుమీ’..

239
Ami Tumi Releasing on June 9th
- Advertisement -

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ “అమీ తుమీ”. వెన్నెలకిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని “యు” సర్టిఫికెట్ అందుకొంది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Ami Tumi Releasing on June 9th

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. “మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన బాణీలన్నీ శ్రోతలను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభిస్తోంది. ఇంద్రగంటి హిలేరియస్ ఎంటర్ టైనర్ గా “అమీ తుమీ” చిత్రాన్ని తెరకెక్కించారు. అవసరాల-అడివి శేష్ ల క్యారెక్టర్, వెన్నెల కిషోర్ నెగిటివ్ షేడ్ లో పండించే కామెడీ సినిమాకి హైలైట్ గా నిలిస్తుంది. అదితి మ్యాకల్-ఈషాల పాత్రలు జనాల్ని హిలేరియస్ గా నవ్విస్తాయి. ఇక తనికెళ్లభరణి పాత్ర ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు” అన్నారు.

Ami Tumi Releasing on June 9th
అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!

- Advertisement -