హీరో విశాల్ త్వరలో నటి అభినయ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ రీసెంట్ గా బాగా పుకార్లు పుట్టించారు. అభినయ తో విశాల్ గత కొన్ని ఏళ్లుగా ఘాటు ప్రేమలో ఉన్నాడని, అందుకే, అభినయ విశాల్ తో ఏడడుగులు వేయబోతుంది అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అభినయ కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ఒప్పుకోవడం లేదట. అభినయ కు తెలుగు, తమిళ భాషల్లో కొత్త చిత్రాల ఆఫర్లు వస్తున్నా.. అంగీకరించడం లేదు. దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
అభినయ పెళ్ళి పీటలెక్కబోతోందని.. అందువల్లే అభినయ తనకు వస్తున్న ఆఫర్లకు నో చెబుతోందనే ప్రచారం సాగింది. ఇక ఇదే అంశంపై అభినయ స్పందిస్తూ.. ‘తెలుగు, తమిళ భాషల్లోని ప్రేక్షకుల్లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు, పేరు ఉంది. అందుకే మంచి పాత్ర తో కూడిన చిత్రాలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాను. అంతకు మించి మరో కారణం అంటూ ఏదీలేదు’ అని ఆమె నటి అభినయ వివరణ ఇచ్చింది.
ఎంతో సింపుల్ గా కనిపించే అభినయ తన సహజసిద్ధమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొత్తానికి అభినయ మాత్రం విశాల్ తో ఏడడుగులు వేయబోతున్న విషయం పై ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు. అటు విశాల్ కూడా ఈ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేయలేదు. మరి నిజంగానే అభినయ – విశాల్ పెళ్లి ఒక్కటి అవుతారేమో చూడాలి.
ఇవి కూడా చదవండి…