కేటీఆర్‌ను కలిసిన అమెరికా ప్రతినిధి బృందం

203
American delegation meets KTR
American delegation meets KTR
- Advertisement -

అమెరికాకు చెందిన 6 రాష్ర్టాల ప్రతినిధుల బృందం పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావును ఈ రోజు సచివాలయంలో కలిసింది. డెలవారె రాష్ర్ట గవర్నర్ జాక్ మార్కెల్ నాయకత్వంలో వచ్చిన ఈ ప్రతినిధి బృందం తెలంగాణలోని వ్యాపార, పెట్టుబడి అవకాశాలను చర్చించింది. కొత్త రాష్ర్టంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు వినూత్నమై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. పారిశ్రామిక పాలసీలోని విశిష్టమైన అవకాశాలను వివరించారు. తాజాగా ప్రపంచ బ్యాంకు మరియు కేంద్రం ఇచ్చిన ర్యాకింగుల్లో మెదటి స్ధానం దక్కడం తెలంగాణ ప్రభుత్వ విధానాలకు నిదర్శనంగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 14 రంగాలను ప్రాధాన్యతాంశాలుగా పెట్టుకుని ముందుకు పొతుందన్నారు. ఇప్పటిదాకా తెలంగాణలో నాలుగు టాప్ పెద్ద సాప్ట్ వేర్ కంపెనీలు హైదరాబాద్ ను తమ కేంద్రంగా ఎంచుకున్నాయని, ప్రాజెక్టులు పూర్తయితే 60 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు.

American delegation meets KTR

అమెరికా పెట్టబడుల కోసం చేపట్టిన పర్యటనల సంధర్భంగా అక్కడి పరిశ్రమల నుంచి వచ్చిన స్పందనను తెలిపారు. ఫార్మ, బయో సైన్సెస్, ఏరో స్పెస్ రంగాల్లో పెట్టుబడులకు పలు హామీలు వచ్చాయని తెలిపారు. అమెరికాలో ఏర్పాటు చేయనున్న రెండు స్టేట్ డెస్క్ ఏర్పాటు, టి బ్రిడ్జి కార్యక్రమాన్ని వివరించారు. ఈ టి బ్రిడ్జి ద్వారా ఇన్నోవేషన్ రంగంలో రెండు ప్రాంతాల మద్య వారధి ఏర్పాడుతున్నదని, స్టార్టప్స్ విస్తరణ, ఫండింగ్ వంటి అవకాశాలను మెరుగుపరుస్తుందన్నారు. రెండున్నర సంవత్సరాల కాలంలో తెలంగాణ చేపట్టిన పారదర్శక విధానాలను తెలుసుకున్న ప్రతినిధి బృందం వాటిని అభినందించింది.

American delegation meets KTR

తెలంగాణతో నైపుణ్య శిక్షణ రంగంలో కలిసి పనిచేసేందుకు పలు రాష్ర్టాల ప్రతినిధులు ఆసక్తి చూపించారు. జర్మనీతో డెలవారె రాష్ర్టం సైతం టి బ్రిడ్జిలాంటి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రికి గవర్నర్ వివరించారు. తెలంగాణతో అమెరికన్ రాష్ర్టాలు సబ్ నేషనల్ ఒప్పందాలు చేసుకునే అంశాలను పరిశీలస్తామన్నారు. పురపాలన శాఖ మంత్రి కూడా అయిన కెటి రామారావు, నగరాలు, పట్టణాల మౌళిక వసతులు కల్పనకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఈ రంగంలో పెట్టుబడులు స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నదని, ఈ విషయంలో అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని కోరుతున్నామని మంత్రి తెలిపారు.సమావేశానంతరం మంత్రి ప్రతినిధులను సన్మానించారు.

ఈ సమావేశంలో మంత్రితోపాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ లు పాల్గోన్నారు.

- Advertisement -