అక్రమ వలసదారులు..తిరిగి భారత్‌కే!

0
- Advertisement -

అక్రమ వలస దారులపై ఉక్కుపాదం మోపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో 7.5 లక్షల మంది భారతీయులు అక్రమంగా ఉంటుండగా తొలి దశలో 18 వేల మందిని భారత్‌కు తరలించినుంది అమెరికా.

మొదటి విమానంలో 205 మంది భారతీయులను వెనక్కి పంపించింది. టెక్సాస్‌ నుంచి అమెరికా సీ-17 మిలటరీ విమానంలో వాళ్లను భారత్‌కు తరలించారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా ఉన్నవాళ్లను స్వదేశానికి తరలిస్తున్నారు.

అమెరికా నుంచి అమృత్‌సర్‌కు డిపోర్టేషన్‌ ప్రక్రియ కొనసాగతుందని అమెరికా అధికారులు వెల్లడించారు. అమెరికాకు వెళ్లాలని చూసే సిక్కులు.. దానికోసం లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అలాంటి వాళ్ల మెడ మీద ఇప్పుడు డిపోర్టేషన్‌ కత్తి పెట్టారు ట్రంప్‌. ఇందుకే ఇండియాకు పంపించిన అక్రమ వలసదారుల తొలి ఫ్లైట్ అమృత్‌సర్‌లో డైరెక్టుగా ల్యాండయింది. అమెరికా నుంచి ఇండియాకు పంపించడానికి ఒక్కొక్కరిపై 4వేల 675 డాలర్లు ఖర్చు పెడుతోంది అమెరికా. అంటే మన కరెన్సీలో 4 లక్షల 6 వేల రూపాయలు అవుతుంది.

Also Read:అడవి పందిని వేటాడుతూ బావిలో పడ్డ పులి!

- Advertisement -