రష్యా సంపన్నులపై అమెరికా ఆంక్షలు!

64
putin
- Advertisement -

ర‌ష్యా సంప‌న్నుల‌పై ఆంక్ష‌లు విధించింది అమెరికా ట్రెజ‌రీ శాఖ. గత కొంతకాలంగా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన ర‌ష్యాపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న అగ్రరాజ్యం అమెరికా తాజాగా పుతిన్ గ‌ర్ల్‌ఫ్రెండ్ అలీనా క‌బేవా, పుతిన్ స్నేహితుడు, బిలియ‌న‌రీ ఆండ్రే గ్రిగోర‌విచ్ గురేవ్‌పై ఆంక్ష‌లు అమ‌లుచేశారు. ర‌ష్యా దాడితో ఉక్రెయిన్‌లో అమాయ‌కులు ఇబ్బందిప‌డుతున్నార‌ని, కానీ పుతిన్ స‌న్నిహితులు మాత్రం సంప‌న్నుల‌య్యార‌ని అమెరికా ట్రెజ‌రీ కార్య‌ద‌ర్శి జానెట్ తెలిపారు.

లండ‌న్‌లో రెండ‌వ అతిపెద్ద ఎస్టేట్ విటాన్‌హాస్ట్ ఎస్టేట్ అత‌ని పేరుమీద ఉంది. ఫోసో ఆగ్రో ఫెర్టిలైజ‌ర్ స‌ప్ల‌య‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడు కూడా అత‌నే. గురేవ్‌తో పాటు అత‌ని కుమారుడితో వ్యాపారాన్ని అమెరికా నిలిపి వేసింది. బ్యాంక్ లావాదేవీల‌ను ఆపేసింది. ఆస్తుల్ని సీజ్ చేసింది.

- Advertisement -