అగ్రరాజ్యంలో మంచుతుపాను బీభత్సం..

54
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో మంచు తపాను బీభత్సం సృష్టించింది. గంటకు 105 కిమీల వేగంతో చలిగాలులు వీస్తుండటంతో న్యూయార్క్‌తో పాటు పలు నగరాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. మైనస్ 40 డిగ్రీల టెంపరేచర్‌ రికార్డు కావడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ తుపానాఉ బాంబ్ సైక్లోన్‌ గా బలపడే అవకాశం ఉందని అక్యూవెదర్‌‌ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో నేషనల్ హైవేలను మూసివేయగా విమానాలను రద్దు చేశారు. దాదాపు 22వేల విమానాలపై మంచు తుఫాన్ ఎఫెక్ట్ ​ పడిందని అధికారులు వెల్లడించారు.

న్యూయార్క్, సెయింట్​పాల్, కెంటకీ, నార్త్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, జార్జియా, ఓక్లహోమాలో పరిస్థితి దారుణంగా ఉంది. డెస్‌‌మోయిన్స్ నగరాన్ని మంచు పూర్తిగా కప్పేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు బయటికి రావొద్దని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -