ఐసిస్‌ స్థావరాలపై అమెరికా దాడులు

5
- Advertisement -

సిరియాలోని ఐసిస్ (ISIS) ఉగ్రవాద స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ముగ్గురు అమెరికన్ సైనికులు మృతి చెందడానికి ప్రతీకారంగా ఈ దాడులను చేపట్టినట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఆపరేషన్‌కు “ఆపరేషన్ హాకీ స్ట్రైక్” అనే పేరును పెట్టినట్లు పెంటగాన్ ప్రకటించింది.

ఈ నెల 13న సిరియాలోని చారిత్రక నగరం పాల్మైరా సమీపంలో అమెరికా దళాలపై ఐసిస్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు అమెరికన్లు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనను అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించిన అమెరికా, ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పేందుకు వెంటనే ప్రతీకార చర్యలకు దిగింది.

పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సెత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “అమెరికన్లను లక్ష్యంగా చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. మా పౌరులు, సైనికుల భద్రతకు ముప్పు తెచ్చే శక్తులపై కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. ఐసిస్‌కు చెందిన శిబిరాలు, ఆయుధ గోదాములు, కమాండ్ కేంద్రాలే లక్ష్యంగా ఈ వైమానిక దాడులు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ ఆపరేషన్ ద్వారా ఐసిస్ కార్యకలాపాలను పూర్తిగా అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. సిరియాలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని పెంటగాన్ పేర్కొంది.

Also Read:MSG:చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్

- Advertisement -