బీఆర్ఎస్‌లో చేరిన అంబర్‌పేట శంకర్

58
- Advertisement -

ఎన్నికల వేళ బీఆర్ఎస్‌లో వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆందోళ్ నిజయోవర్గంతో పాటు అంబర్ పేట, ఉప్పల్ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక అంబర్ పేట శంకర్‌..మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మళ్లీ మూడోసారి అధికారంలోకి వచ్చేది కేసీఆర్ సర్కారే అనే విశ్వాసంతో తెలంగాణ అభివృద్ధితో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం చేరుతున్న అందరికీ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు.

ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ సర్కిల్ మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముశనం శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఎ కల్పనారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు.

వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతర కరెంట్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా పేరు గాంచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Also Read:KTR:అవినీతి గురించి రాహుల్ మాట్లాడటమా?

- Advertisement -