బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని పంజాగుట్ట కూడలిలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్ మహమూద్ అలీ ఎర్రబెల్లిదయాకర్‌రావు ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువరు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…బీఆర్ అంబేద్కర్ లేకపోతే తెలంగాణ లేదన్నారు. ఆయన కృషి వల్లే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యంగం వల్లే తెలంగాణ ఏర్పాటైందన్నారు. సీఎం కేసీఆర్ దమ్మున్న నేత అని పొగిడారు. కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు కార్యక్రమం వల్ల రాష్ట్రంలో దళితులు ఉన్నత స్థితిలోకి వస్తున్నారని అన్నారు.
సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడం సాహోసోపేతమైన నిర్ణయమని అది కేవలం సీఎం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైందన్నారు. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు పెడుతున్నామని కేటీఆర్ ఈ సందర్బంగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి…