ఈసీతో టీడీపీ మిలాఖత్:అంబటి రాంబాబు

13
- Advertisement -

ఏపీలో ఈసీతో టీడీపీ మిలాఖత్ అయిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం ధ్వంసం ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.

రామకృష్ణారెడ్డి ఈవీఎం మెషిన్లను ధ్వంసం చేస్తున్న వీడియో నిజమా? ఫేకా… నిజమైతే ఎన్నికల కమిషన్‌ వాటిని విడుదల చేయకుండా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ కు ఎలా చేరిందో చెప్పాలన్నారు. ఈ ఘటనపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేరం జరిగితే శిక్ష పడాల్సిదే కానీ ఫేక్ వీడియోలు సృష్టించి నేరాన్ని మోపడం తగదన్నారు అంబటి. రాష్ట్రంలో మిగతా చోట్ల ఈవీఎంల ధ్వంసం, పోలింగ్‌ల ఆక్రమణకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..

- Advertisement -