ఉద్యోగులకు మళ్లీ షాకిచ్చిన అమెజాన్..

56
- Advertisement -

ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ఉద్యోగులకు మరోసారి షాకిచ్చింది అమెజాన్ సంస్థ. గత సంవత్సరం నవంబర్‌లో 18 వేల ఉద్యోగులను తొలగించిన అమెజాన్ తాజాగా సంస్థలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9 వేల మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది.

ఇలాంటి నిర్ణయం కఠినమైనదే అయినప్పటికీ తప్పడం లేదని అన్నారు సంస్థ సీఈవో ఆండి జాస్సీ. దీర్ఘకాలంలో కంపెనీ విజయానికి ఇది చాలా కీలకమని ఆయన స్పష్టం చేశారు.తొలగింపునకు గురైన ఉద్యోగులకు 24గంటల నోటీసు, వేతనం ఇవ్వనున్నారు.

అమెజాన్ తాజాగా ఉద్యోగుల తొలగింపు నిర్ణయంతో కంపెనీ చరిత్రలో ఐదవ అతిపెద్ద తొలగింపు కానుంది.అమెజాన్ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది ఉద్యోగులు కలిగి ఉన్నారు. సంస్థ తాజా నిర్ణయంతో నాలుగు నెలల్లోనే 27వేల మంది ఉద్యోగులను తొలగించినట్లయింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -