చాలామందికి షాప్ లకు వెళ్లి వస్తువులు కొనేందుకు సమయం దొరకకపోవడంతో ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఆన్ లైన్ లో ఒక మద్యం తప్ప మిగతా అన్ని వస్తువులు దొరికేవి. కానీ ఇప్పుడు మద్యం కూడా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. కానీ అది ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రమే. ఇండియాలో మద్యం డెలివరీకి అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, బిగ్ బాస్కెట్ లకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతించింది.వెస్ట్ బెంగాల్ స్టేట్ బీవరేజస్ కార్పొరేషన్ నుంచి అనుమతులు వచ్చాయని అమెజాన్ స్పష్టం చేసింది.
కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైన్స్ షాపుల వద్ద జనాలు ఎక్కువగా గుమిగూడుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇండియాలో తొలిసారిగా మద్యం హోం డెలివరీ చేసిన రాష్ట్రం వెస్ట్ బెంగాల్ గా రికార్డుకెక్కింది. మరి ఆన్ లైన్ లో మద్యం బుక్ చేస్తే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారో లేక ఎమ్మార్పి రేటుకు విక్రయిస్తారో చూడాలి మరి. ఇందుకు తగిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనుంది వెస్ట్ బెంగాల్ సర్కార్.